HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన పెండ్లి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఎల్ఓసీ కాపీని శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ఎల్ఓసీతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిరుపేదల వైద్య అవసరాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.