MDK: రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మద్దూర్ సునీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.