భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ బుధవారం అశ్వారావుపేట సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్న ఆయన భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను ఆరా తీశారు.