MDK: రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతిలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇవాళ కొల్చారం మండలం సత్యసాయి రైస్ మిల్, వరిగుంతం సొసైటీ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.