PDPL: సుల్తానాబాద్ పురపాలక సంఘంలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ పరిశీలించారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. పట్టణంలో ల్యాండ్ మార్కులు పాఠశాలలు, దేవాలయాలు, కార్యాలయాలు, తదితర గుర్తులను బ్లాక్ వారీగా స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ఖచ్చితమైన సమాచారం ఉండాలని అధికారులకు సూచించారు.