SDPT: కోహెడ మండలం మైసంపల్లి గ్రామంలో బొడ్రాయి భూమి పూజ కార్యక్రమం సర్పంచ్ సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. వేదమంత్రోచ్చారణల మధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందులో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. గ్రామస్తుల సహకారంతో త్వరలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు.