JN: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణ కేంద్రంలో పోలీస్ శాఖ, రవాణా శాఖలు సంయుక్తంగా కలిసి పాఠశాల విద్యార్థులతో మానవహారం నిర్మించి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పండరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ ఉన్నారు.