HYD: రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు లబ్దిదారులకు 426 షాదీముబారక్, 75 కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకొని ఆర్థికంగా లబ్దిపొందాలన్నారు. పేదింటి వివాహానికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో లబ్ధిచేకూరుస్తుందన్నారు.