HYD: వివేకానంద నగర్ కాలనీ కమాన్ నుంచి రూ. 1 కోటి అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న రోడ్డు డివైడర్ పనులను ఎమ్మేల్యే, పీఎసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ, GHMC ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ట్రాఫిక్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులలో నాణ్యత తగ్గకుండా చూడాలన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.