MDCL: ఘట్కేసర్, బోడుప్పల్ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణ సమయంలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాల్సిన నిబంధన ఉన్నప్పటికీ, అది అమలుకు మాత్రం కనిపించడం లేదు. దీనివల్ల భూగర్భ జలాల స్థాయి పడిపోతూ నీటి కొరత సమస్యలు పెరుగుతున్నాయి. అధికారులు పర్యవేక్షణ పెంచి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.