BHPL: మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం అప్రజాస్వామీకమని బీజేపీ చిట్యాల మండలాధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాలలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. బీజేపీ పార్టీ మహిళా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని, మహిళలకు ద్రోహం చేసే పార్టీలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని మండల అధ్యక్షుడు అన్నారు.