NLG: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితాను బుధవారం విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 33మండలాల్లో 33 జడ్పీటీసీ, 353ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచించారు.