KNR: అటవీ శాఖ ఉద్యోగుల క్రీడా పోటీలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్లో బుధవారం రాత్రి ఘనంగా ముగిసాయి. రెండు రోజుల పాటు జరిగిన క్రీడా పోటీలలో రాజన్న జోన్ పరిధిలోని 5 జిల్లాలు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, క్యారం, చెస్, క్రికెట్, టాగ్ అఫ్ వార్ నిర్వహించారు.