NLR: ఈ నెల 10 వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున, వారి పర్యటనను విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామం విస్వసముద్ర బయో ఇధనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రానున్న దృష్ట్యా, ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు.