గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్ తొలి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేశాయన్నారు. ఈ అపూర్వ ఒప్పందం ద్వారా బందీలందరూ విడుదలవుతారని, ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని తెలిపారు. సైనికుల ఉపసంహరణ దీర్ఘకాలిక శాంతికి తొలి అడుగు అని ట్రంప్ అభివర్ణించారు.