జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఇటీవల హెబ్సిబా, (RBF) సంస్థల వల్ల మోసపోయిన బాధితుల పక్షాన వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్తో పాలకుర్తి జర్నలిస్టులు చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సంస్థల వల్ల నష్టపోయిన బాధితులు భయభ్రాంతులకు గురి కాకుండా, స్వేచ్ఛగా ఫిర్యా దు చేయవచ్చని సూచించారు. వారి ఫిర్యాదులను స్వీకరించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.