MBNR: కామారెడ్డిలో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, హడావుడిగా రిజర్వేషన్లు ప్రకటించడం కేవలం ఎన్నికల డ్రామా తప్ప మరొకటి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. 22 నెలలుగా మాట్లాడకుండా ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. బీహార్, మహారాష్ట్ర ఎన్నికల కోసమే ఈ చర్యలని ఎద్దేవా చేశారు.