WGL: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పర్వతగిరి మండలం కల్లెడలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దెల శ్రీనివాస్ (42) ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఏటా దిగుబడి తగ్గి ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.