KRNL: జిల్లాలోని ఎనిమిది చెరువుల్లో పూడికతీత పనులకు కలెక్టర్ డా. ఏ. సిరి పరిపాలన అనుమతి మంజూరు చేశారు. ఈ పనులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపడతారు. మొత్తం రూ. 36.64 లక్షలు కేటాయించారు. సీ. బెలగల్లో 3, గూడూరులో 2, ఆదోని, చిప్పగిరి, వెల్దుర్తి మండలాల్లో చెరువు పనులు చేపడతామని నీటి యాజమాన్య సంస్థ పిడీ వెంకటరమణయ్య తెలిపారు.