ELR: మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా బాణసంచా తయారు చేసినా, నిల్వ చేసినా లేదా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్.ఐ రామచంద్రరావు హెచ్చరించారు. ఇళ్లు, షాపులు, జన సముదాయాల మధ్య గోడౌన్లలో స్టాకు నిల్వ ఉంచినా, లైసెన్సు లేకుండా అమ్మినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. విక్రయదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.