TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో భద్రత అధికారుల వైఫల్యం మరోసారి బయటపడింది. తమిళనాడుకు చెందిన భక్తులు తమ వెంట నాగ శిలను మహాద్వారం వరకు తీసుకుని వచ్చారు. గుర్తించిన హోంగార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఉ 11:40 సమయంలో రాహు కేతు మండపంలో పూజలు నిర్వహించుకున్నట్లు సమాచారం. గతంలో అనధికారికంగా ఆలయంలో విగ్రహాలు ఏర్పాటు చేయగా అది పెద్ద దుమారం రేపింది.