NDL: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశాల మేరకు రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఏజీఎం సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం కలెక్టరేట్ లోని పీజీఆరఎస్ హాలులో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఇన్చార్జి రెడ్ క్రాస్ చైర్మన్ డీర్ఓ రాము నాయక్ తెలిపారు. ఈ ఎన్నికల్లో రెండవసారి ఛైర్మన్ దస్తగిరి డాక్టర్ మమత రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.