GNTR: తెనాలిలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. తోట లక్ష్మీకోటేశ్వరరావు నిర్మాతగా, AK జంపన్న డైరెక్టర్గా తెరకెక్కిస్తున్న నూతన చిత్రానికి సంబంధించి రెండు రోజులుగా పట్టణంలో పలుచోట్ల షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. వరుణ్ సందేశ్, రంగస్థలం మహేశ్, సత్యం రాజేశ్, పృథ్వి, సోహెల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘రెచ్చిపోదాం బ్రదర్’ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.