SKLM: పలాస రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు బుధవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద 3 కేజీల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. గంజాయి అక్రమంగా నిల్వ చేసిన, తరలించిన కఠినమైన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.