ప్రకాశం: కనిగిరి ఆల్ఫా అగ్రికల్చర్ కాలేజీలో కొత్తగా నియమితులైన డీఎస్సీ అభ్యర్థులకు జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. సీఐ ఖాజావలి యువత మాదక ద్రవ్యాలకు ఎడిక్ట్ అవ్వకుండా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలోని మార్పులనుగమనించాలని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటుంటే టోల్‌ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేస్తే వారికి అడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తామన్నారు.