KRNL: కూటమి ప్రభుత్వం 16 నెలలుగా సూపర్ సిక్స్ పథకాలను అరకొరగా అమలు చేసి ప్రజలను మోసం చేస్తున్నట్లు ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బుట్టా రేణుక అన్నారు. బుధవారం పెద్దమరివీడు గ్రామంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ -మోసం గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు పథకాల్లో సగం సగమే ఇస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కొత్త పింఛన్లు మంజూరు లేకపోవడం దుర్మార్గమన్నారు.