GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) నూతన ఉపకులపతి(వీసీ)గా ప్రొఫెసర్ సమంతపూడి వెంకట సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వారణాసిలోని బీహెచ్‌యూలో ఎంటమాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.