BDK: ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృతస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని హితవు పలికారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.