అన్నమయ్య: సంబేపల్లి మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన నల్లపోతుల జనార్ధన (45) అనే రైతు బుధవారం ఉదయం పొలం దున్నుతుండగా దుర్మరణం చెందాడు. ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా మిల్లర్ రిపేరు చేసే సమయంలో ట్రాక్టర్ ముందుకు కదలడంతో మిల్లర్ కిందపడి తీవ్ర గాయాలై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతన్ని రాయచోటి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చేందినట్లు తెలిపారు.