హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలను పాటించడం మనందరి సంరక్షణకే. రోజుకు సగటున 31 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. కనీసం 5 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చనిపోయినవారిలో ద్విచక్ర వాహనదారులు, పాదచారులే అధికంగా ఉన్నారు. కుటుంబ సభ్యులకు ఈ ప్రమాదాల గురించి చెప్పి, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, లేదంటే భారీ ఖర్చుకు (ఫైన్లకు), ప్రాణాలకే ముప్పు అని వివరించాలి.