BDK: మణుగూరు ప్రధాన రహదారి అడుగడుగునా గుంతలే సురక్ష బస్టాండ్, సినిమా హాల్ సెంటర్, ద్వారకా హోటల్ ఏరియా, సాయిబాబా టెంపుల్ పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరింత అద్వానంగా మారింది. ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు నేడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.