ప్రకాశం: కొమరోలు మండలంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతుల కారణంగా రెడ్డిచెర్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి, ఎర్రపల్లి గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.