ప్రకాశం: త్రిపురాంతకంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడపి సమీపంలోని మానేపల్లి రహదారిలో గురువారం ఉదయం ద్విచక్ర వాహనం-బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.