HYD: పండ్ల వ్యాపారం పేరుతో తుపాకులు అమ్ముతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండుకు చెందిన విజయ్ యాదవ్, బంటి కుమార్ యాదవ్‌లు లింగపల్లి ప్రాంతంలో ఉంటూ, రూ.58 వేలకు తుపాకీ కొని ఎక్కువ ధరకు అమ్మాలని ప్రయత్నించారు. ఫలక్‌నూమా వద్ద వీరిని పట్టుకున్నారు. వారి నుంచి ఒక దేశవాళీ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.