KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని 123వ రేషన్ షాపులో బుధవారం పౌర సరఫరాల శాఖ అధికారులు శివ, మహేంద్ర తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా రికార్డుల మేరకు రేషన్ సరుకులు లేకపోవడంతో, డీలర్ పై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. బియ్యం, చక్కెర, జొన్నలు నిల్వల్లో తేడాలుండడంతో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదించారు.