GNTR: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో ఆందోళన మొదలైంది. ‘అసైన్డ్’ అనే పదం తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో గందరగోళమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అసైన్డ్ పదం తొలగించి కొత్తగా పట్టాలు ఇస్తారని రైతులు ఆశించినట్లుగా కాకుండా, రిటర్నబుల్ ప్లాట్లు తీసుకుని వారికి ఇచ్చే కొత్త పట్టాలో మాత్రమే ఈ మార్పు వర్తిస్తుందని అధికారులు చెపుతున్నారు.