NLR: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలు దేశాభివృద్ధికి బాటలు వేస్తాయని జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రతి ఇంట్లో దీపావలి కాంతులు వెల్లివిరుస్తున్నాయని పేర్కొన్నారు. బుధవారం జిల్లా సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.