అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రెండో విడత పీజీ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన తేదీల్లో మార్పు చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ నరసింహన్ తెలిపారు. బుధవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ సాగాల్సి ఉండగా.. దానిని ఈనెల 13వ తేదీకి మార్చినట్లు స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు ప్రక్రియ కొనసాగుతుందన్నారు.