KMM: కూసుమంచి మండలం జీళ్లచెరువులో గురువారం ఐదో విడత యూరియా బస్తాలను పంపిణీ చేయనున్నట్లు అగ్రికల్చర్ ఏఈవో రవిందర్ తెలిపారు. రైతులందరు ఉదయం 9 గంటలకు 776 నుంచి 1000 నెంబర్ టోకెన్లు కలిగిన వారికి యూరియా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మొత్తం యూరియా 225 బస్తాలు రావడం జరిగిందని, సకాలంలో రైతులు పంచాయతీ కేంద్రం వద్దకు వచ్చి తీసుకోవాలని సూచించారు.