AP: సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో రూ. 212 కోట్ల వ్యయంతో రాజ్‌భవన్ నిర్మాణానికి CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్‌భవన్ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించిన డిజైన్ అద్భుతంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.