ELR: జిల్లాలోని మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ పునః పరిశీలన ఈ నెల 10వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని డీఆర్డీఏ పీడీ విజయరాజు తెలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఏరియా ఆసుపత్రిలలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. నోటీసు అందుకున్న వారు మాత్రమే హాజరు కావాలని ఆయన కోరారు.