HYD: ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా గురువారం BRS ‘ఛలో బస్ భవన్’ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది.పెంచిన ఛార్జీలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతర నాయకులు బస్సులో బస్ భవన్‌కు చేరుకోనున్నారు. అనంతరం KTR ఆధ్వర్యంలో RTC MDకి వినతిపత్రం ఇవ్వనున్నారు.