MBNR: పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకుంటే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. డీసీసీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.