ప్రకాశం: కొండపి ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం ఒంగోలులో నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్‌పై న్యాయవాది చెప్పు విసిరి దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రధాన న్యాయమూర్తి దళితుడు కావడంతోనే ఈ దుశ్చర్య జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.