MDK: ఏడుపాయల వన దుర్గ మాతను కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ కే.పొన్ను స్వామి, వినోద్ కుమార్, అభిషేక్ కుమార్, ఎస్ఎస్. పింటు దర్శించుకున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షణలో మెదక్ జిల్లాలో పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వరదను స్వయంగా పరిశీలించారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు.