KDP: బద్వేల్ మండలంలోని బయనపల్లె చెరువు,చిన్నంపల్లె గ్రామ పొలం సర్వే నం.1567/1ఎ లోని 1.54 సెంట్ల భూమిని ఆక్రమించే యత్నం జరుగుతోందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ విషయమై వారు ఆర్టీవో కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందించారు. భూమిని వెంటనే స్వాధీనం చేసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.