AP: అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో పాటు జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను కస్టడీకి కోరే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.