గుంటూరులోని అనపూర్ణ కాంప్లెక్స్‌లో బుధవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన రూ.97 లక్షల విలువైన కల్తీ సిగరెట్లను పట్టుకున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఈ నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకుని, గోదాంను సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి, ఎక్సైజ్ శాఖ విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.