NLG: స్థానిక సంస్థల ఎన్నికలలో ZPTC,MPTC స్థానాలకు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని SP శరత్ స్పష్టం చేశారు. నామినేషన్లు దాఖలు సందర్భంగా నిర్వహించే ఊరేగింపు కార్యక్రమాలకు అభ్యర్థులు ముందుగా పోలీసుశాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.