CTR: చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో 11న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఉచిత వైద్య శిబిరానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కళాశాల సిబ్బందికి ఆమె సూచించారు.